26.1.09

విస్తాలో తెలుగు inscriptలో టైపు చేయడానికి

సోపానం 1. నియంత్రణా పానెల్‌(control panel)కు వెళ్లండి.

clip_image001

 

సోపానం 2. నియంత్రణా పానెల్లో “Clock, Language and Region” లోని “Change keyboards or other input methods” ను క్లిక్ చేయండి.image

 

సోపానం 3. “Regional and Language Options” dialog లో “Change keyboards” ను ఎంచుకోండి.

image

 

సోపానం 4. ఇప్పుడు ఈ క్రింద చూపిన “Text Services and Input Languages” dialog లోని “Installed Services” విభాగంలోని “Add” బొత్తాన్ని క్లిక్ చెయ్యండి.

image

 

సోపానం 5. ఇప్పుడు తెరుచుకొన్న “Add Input Language” లో దిగువ చూపినట్టు తెలుగు కీబోర్డును కలపండి.

image

 

సోపానం 6: తరువాత, ఈక్రింది విధంగా తెలుగు కీబోర్డు కలసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ “OK” క్లిక్ చేయండి.

image

 

సోపానం 7: ఇప్పుడు మీ డెస్కుటాపుమీద గాని, టాస్కుబారుమీద గాని ఉన్న లాంగ్వేజిబార్ కు వెళ్లి తెలుగును ఎంచుకొని టైపుచేయడం మొదలు పెట్టండి. కీబోర్డులేయవుటును క్రింద చూపడంజరిగింది.

image

 

18.3.06

విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి

విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి.

సోపానం 1 :
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


సోపానం 2:
ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.


సోపానం 3:
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.


సోపానం 4:
క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి.


సోపానం 5:

Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.


సోపానం 6:
ఇప్పుడు Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Preferences విభాగంలోని Language Bar ని నొక్కండి.


సోపానం 7:
Language Bar Settings లో Show the Language bar on the desktop ని ఎంచుకోండి.


సోపానం 8:
ఇప్పుడు మీ డెస్కుటాపు మీద ఈ క్రింద చూపినట్లుగా Language Bar కనిపిస్తుంది. దీనిలో తర్వాతి బొమ్మలో చూపిన విధంగా Teluguను ఎంచుకుని మీకు కావలసిన చోట తెలుగులో టైపు చేసుకోండి. కీబోర్డు లేయవుట్ చివరి బొమ్మలో చూపబడినది.


కీబోర్డు లేయవుట్

24.2.06

మీరిది చూసారా..?

తెలుగులో నా గోడు (Telugu Blog): మీరిది చూసారా..? నుండి

  1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా?
  2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు?
  3. "బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు?


వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు...అది పెద్దదే, కొత్తదే.



ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.

15.9.05

రాజకీయాలు

ఈ మద్య రాజకీయ నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఎందుకో ఇక్కడ వ్రాద్దామనిపించింది.


పిచ్చిపట్టి మాట్లాడుతున్న బాబు
-
వైఎస్‌

నాది ప్రస్తుతం బుద్ధావతారం
-ఎమ్మెస్‌

కేసీఆర్‌, నరేంద్రలను కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించాలి. మానసికంగా దెబ్బతిన్న ఇద్దరినీ పిచ్చాసుపత్రిలో చేర్చాలి.
- కాంగ్రెస్‌ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గోనె ప్రకాశరావు, పి.సుధాకరరెడ్డి,
ఆర్‌.డి.విల్సన్‌, డి.నాగేందర్‌, కె.జ్యోతిదేవి

నరేంద్ర మాటలు పిచ్చికూతలు
- సీపీఎం నేతలు బి.వి.రాఘవులు, నోముల నర్సింహయ్య

కేసీఆర్‌, నరేంద్రలాంటి మూర్ఖులు ఎక్కడా ఉండరు
-
సీపీఐ కార్యదర్శి నారాయణ

కేకేవి కుక్క అరుపులు:
-నరేంద్ర

తెలంగాణ అనే అమృత కలశాన్ని కబళించేందుకు ప్రయత్నించే వారిని నల్లతాచుల్లా కాటేయండి. తెలంగాణ తల్లి కొంగుకు నిప్పు పెడుతున్న వ్యతిరేకుల్ని నరికి, వారి రక్తంతో ఆమె పాదాల్ని అభిషేకించండి. ఆంధ్ర వలసవాదుల చేతుల్లోంచి తెలంగాణ సంకెళ్లను తెంచేందుకు సిద్ధం కండి. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస నేతలు, టీజేఎస్‌ సైనికులు విజృంభించి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కాంగ్రెస్‌ను మట్టుబెట్టాలన్నారు
-నరేంద్ర

తెలంగాణ రాదంటారా? ఎలా రాదో చూస్తాం. ఈ ప్రాంతంలో మిమ్మల్నందర్నీ భూ స్థాపితం చేస్తాం
-నరేంద్ర కాంగ్రెస్‌ నేతల్ని ఉద్దేశించి.

సిగ్గూఎగ్గూ లేదా వైఎస్‌?
నీవంటి దుర్మార్గుల్ని రచ్చకీడుస్తాం
దెబ్బకు దెబ్బతీస్తాం:
-కేసీఆర్‌


ఇటుకలతో దాడి చేసేవారికి రాళ్లతో సమాధానమిస్తుంది. చేతులతో దాడికి దిగేవారిని కర్రలతో ఎదుర్కొంటుంది. ఎలా ఇచ్చినా జవాబు మాత్రం పకడ్బందీగా ఇచ్చి తీరుతుంది.
-కేసీఆర్‌ టీజేఎస్‌ గురించి.


కేసీఆర్‌, నరేంద్ర
వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే కాలంలో తెలంగాణ రావడమేమోగాని, పరుచూరి బ్రదర్స్ కి సినిమా ఇండస్ర్టీలో నూకలు చెల్లిపోయినట్లు మాత్రం గట్టిగా అనిపిస్తోంది.

23.1.05

ఆరంభ శూరత్వం

నా బ్లాగ్ ప్రస్థానం చూస్తుంటే ఆంధ్రులు ఆరంభ శూరులనే మాట నిజమేనేమో అనిపిస్తుంది.

15.12.04

తెలుగు

దీనిలో కేవలం తెలుగులో మాత్రమే వ్రాయాలనుకుంటున్నాను.