15.9.05

రాజకీయాలు

ఈ మద్య రాజకీయ నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఎందుకో ఇక్కడ వ్రాద్దామనిపించింది.


పిచ్చిపట్టి మాట్లాడుతున్న బాబు
-
వైఎస్‌

నాది ప్రస్తుతం బుద్ధావతారం
-ఎమ్మెస్‌

కేసీఆర్‌, నరేంద్రలను కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించాలి. మానసికంగా దెబ్బతిన్న ఇద్దరినీ పిచ్చాసుపత్రిలో చేర్చాలి.
- కాంగ్రెస్‌ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గోనె ప్రకాశరావు, పి.సుధాకరరెడ్డి,
ఆర్‌.డి.విల్సన్‌, డి.నాగేందర్‌, కె.జ్యోతిదేవి

నరేంద్ర మాటలు పిచ్చికూతలు
- సీపీఎం నేతలు బి.వి.రాఘవులు, నోముల నర్సింహయ్య

కేసీఆర్‌, నరేంద్రలాంటి మూర్ఖులు ఎక్కడా ఉండరు
-
సీపీఐ కార్యదర్శి నారాయణ

కేకేవి కుక్క అరుపులు:
-నరేంద్ర

తెలంగాణ అనే అమృత కలశాన్ని కబళించేందుకు ప్రయత్నించే వారిని నల్లతాచుల్లా కాటేయండి. తెలంగాణ తల్లి కొంగుకు నిప్పు పెడుతున్న వ్యతిరేకుల్ని నరికి, వారి రక్తంతో ఆమె పాదాల్ని అభిషేకించండి. ఆంధ్ర వలసవాదుల చేతుల్లోంచి తెలంగాణ సంకెళ్లను తెంచేందుకు సిద్ధం కండి. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస నేతలు, టీజేఎస్‌ సైనికులు విజృంభించి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కాంగ్రెస్‌ను మట్టుబెట్టాలన్నారు
-నరేంద్ర

తెలంగాణ రాదంటారా? ఎలా రాదో చూస్తాం. ఈ ప్రాంతంలో మిమ్మల్నందర్నీ భూ స్థాపితం చేస్తాం
-నరేంద్ర కాంగ్రెస్‌ నేతల్ని ఉద్దేశించి.

సిగ్గూఎగ్గూ లేదా వైఎస్‌?
నీవంటి దుర్మార్గుల్ని రచ్చకీడుస్తాం
దెబ్బకు దెబ్బతీస్తాం:
-కేసీఆర్‌


ఇటుకలతో దాడి చేసేవారికి రాళ్లతో సమాధానమిస్తుంది. చేతులతో దాడికి దిగేవారిని కర్రలతో ఎదుర్కొంటుంది. ఎలా ఇచ్చినా జవాబు మాత్రం పకడ్బందీగా ఇచ్చి తీరుతుంది.
-కేసీఆర్‌ టీజేఎస్‌ గురించి.


కేసీఆర్‌, నరేంద్ర
వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే కాలంలో తెలంగాణ రావడమేమోగాని, పరుచూరి బ్రదర్స్ కి సినిమా ఇండస్ర్టీలో నూకలు చెల్లిపోయినట్లు మాత్రం గట్టిగా అనిపిస్తోంది.