24.2.06

మీరిది చూసారా..?

తెలుగులో నా గోడు (Telugu Blog): మీరిది చూసారా..? నుండి

  1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా?
  2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు?
  3. "బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు?


వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు...అది పెద్దదే, కొత్తదే.ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.

2 comments:

chandu said...

bavundandi

Ramanadha Reddy said...

కంది పప్పును ఆంగ్లంలో ఎమంటారో వికిపీడియా చెప్పింది నాకు.
ఆ సంబరంలో కొంత చిన్న మొత్తం చందా ఇచ్చా.
మీ బ్లాగు చూసి తెలుగు సర్వస్వంలో నా ఉడతాభక్తి సాంకేతిక సాయం చేయాలని బలంగా అనుకున్నాను. చూద్దాం ఎమి చేయగలనో!!